JN: దేవరుప్పుల మండలంలోని నల్లకుంట తండాకు చెందిన సురేష్ BRS పార్టీ బలపరచిన వార్డు సభ్యుడిగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. అతను ఇవాళ TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఝాన్సీ రెడ్డి సురేష్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల నాయకులు పాల్గొన్నారు.