ADB: గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో శనివారం భూతగాదాల్లో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్ సిందే, ఆకాష్ సిందే అన్నదమ్ముల కొడుకులు. భూమి విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. గొడవ పెరగడంతో ఆగ్రహానికి గురైన ఆకాష్, రామ్ సిందేపై కత్తితో రెండు చోట్ల పొడిచాడు. బాధితుడి భార్య విజయమాల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రణయ్ కేసు నమోదు చేశారు.