NTR: నేటి ఆధునిక సాంకేతిక సమాజంలో ఏ వ్యక్తి అయినా రాణించాలంటే విద్యే మూలాధారమని జిల్లా గిరిజన సంక్షేమధికారి ఫణి వెల్లడించారు. మైలవరంలోని లీలావతి గిరిజన పాఠశాలను ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థులకు సూచించారు.