NLG: చిట్యాల పీఎంశ్రీ జి.ప.ఉ.పాఠశాలలో విద్యార్థులు శనివారం ‘పోషణ ఆహారోత్సవం’ ను ఉత్సాహంతో నిర్వహించారు. విద్యాశాఖ సూచనతో శనివారం పేరెంట్, టీచర్స్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో తయారు చేసిన పోషకాలతో కూడిన రకరకాల ఆహార పదార్థాలను తయారుచేసి తీసుకొచ్చారు. హెచ్ఎం సుశీల, టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.