NZB: విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని భీమ్గల్ ఎస్సై సందీప్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శనివారం సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.