CTR:18 ఏళ్లు నిండని పిల్లలను పనిలో పెట్టుకుంటే దుకాణాలు సీజ్ చేయడంతో పాటు కట్టిన చర్యలు ఉంటాయని పుంగనూరు లేబర్ ఆఫీసర్ మధుబాబు హెచ్చరించారు. ఇవాళ పుంగనూరులో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పుంగనూరు, చౌడేపల్లి, గంగవరం, పెద్దపంజాణి, పలమనేరు ప్రాంతాల్లో తనిఖీల నిర్వహిస్తున్నట్లు చెప్పారు.