WGL: జిల్లా కేంద్రంలో నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. రాబోయే MPTC, ZPTC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. ఇటీవల జరిగిన GP ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు చెంపపెట్టు అని ఆయన అన్నారు. వెయ్యి ఓట్ల లోపు ఉన్న గ్రామాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, మేజర్ GPలన్నీ BRS ఖాతాలో పడ్డాయని పేర్కొన్నారు.