ప్రధాని మోదీ పర్యటనలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌కు ఆయన బయల్దేరారు. గమ్యస్థానంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో రిస్క్ తీసుకోకుండా పైలట్లు చాపర్‌ను తిరిగి కోల్‌కతాకే మళ్లించారు. దీంతో మోదీ పర్యటన షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశముంది.