NZB: 9 నెలల బాబును విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ ఉంటున్నారు. వారి వద్ద ప్రస్తుతం బాబు కనిపించకపోవడంతో విక్రయించినట్లు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు వెళ్లింది. వారు విచారణ జరిపి నిర్ధారించారు.