వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చు నివేదికలను ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సకాలంలో అందజేయకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.