TG: హైదరాబాద్ నల్లకుంట పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. నల్లకుంట వడ్డేరబస్తీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొదటి అంతస్తులో ఉన్న ఏడుగురిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.