TG: ప్రముఖ నటి ఆమని బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమె రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఆమెకు ఉన్న అభిమాన బలం, సామాజిక అంశాలపై గతంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీకి ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.