కృష్ణా: పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐదేళ్లలోపు చిన్నారులందరికీ చుక్కలు వేయించాలని వైద్యాధికారిణి రాణి సంయుక్త కోరారు. శనివారం వైద్య సిబ్బందితో కలిసి కోడూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలోని 21 బూత్‌లతో పాటు బస్టాండ్, పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చుక్కల మందు వేస్తామని తెలిపారు.