AP: అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు శాసనసభా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి వారితో కలిసి తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటలో జరిగే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.