VVSP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, విశాఖ వీఎంఆర్డీఏ కమిషనర్ N. తేజ్ భరత్ శనివారం టీయూ-142 (TU-142) ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి నెలా నిర్వహించే ‘స్వచ్ఛతా ప్రతిజ్ఞ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఎంఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.