PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ మల్యాల బాలికల వసతి గృహంలో ఓపెన్ కేటగిరిలో కేర్‌టేకర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి మహేశ్ పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీతో పాటు బీఎడ్, డీఎడ్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తెలంగాణ మోడల్ స్కూల్ మల్యాలలో ఈనెల 23లోగా సమర్పించాలన్నారు.