E.G: ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో అమరజీవి జలధార వాటర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శనివారం పెరవలిలో ఆయన మాట్లాడారు. జలధార వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.7,910 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.2 కోట్ల మందికి దాహం తీరుతుందన్నారు.