E.G: పరిసరాల శుభ్రతను పాటిస్తూ ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ లక్ష్య సాధనకు విద్యార్థులు పునరంకితం కావాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను పరిశీలించారు.