MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయ పాలన వ్యవహారాల బాధ్యుడు, హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఈనెల 30వ తేదీన నూతన ఉప్పల్ కోర్టుల భవన సమూదాయాన్ని ప్రారంభిస్తారు. మేడిపల్లిలో సెట్విన్ సెంటర్ భవనాన్ని మూడు కోర్టులకు కేటాయించి, అదనపు నిర్మాణాలను పూర్తి చేశారు. దీని ద్వారా న్యాయ సేవలు మరింత దగ్గరగా అందుతాయని అధికారులు తెలిపారు.