WGL: వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈస్ట్ జోన్ DCP అంకిత్ కుమార్ సూచించారు. ఇవాళ DCP మాట్లాడుతూ.. రాజీపడదగ్గ సివిల్, క్రిమినల్, కుటుంబ తగాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీమార్గమే రాజ మార్గం అని ఆయన సూచించారు.