KRNL: ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కల్లుదేవకుంట ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ సురేష్ తెలిపారు. శనివారం ఆశా కార్యకర్తలతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో చుక్కలు వేయించకపోతే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కలు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.