W.G: జాతీయ న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు శనివారం తణుకులో బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, దుర్గాభవాని పాల్గొన్నారు.