CTR: పులిచెర్ల మండలం దేవళంపేటలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ వేడుకగా ధనుర్మాసం పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ఉదయం అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అనంత కుమారాచార్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.