TG: అక్రమ ట్యాపింగ్ కేసులో ఏర్పాటైన కొత్త సిట్ సభ్యులతో సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు. మొదట ఎక్కడి నుంచి విచారణ ప్రారంభించాలనే అంశంపై చర్చించారు. అనంతరం కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ నుంచి సీసీఎస్ ఆఫీసుకు తీసుకెళ్లి.. ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.