CTR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డీటీ సుధారాణి ఆధ్వర్యంలో ఇవాళ పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కుమారి అముద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. రేపు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు లోపల పిల్లలకు పోలియో చుక్కలు వేయలన్నారు.