నల్గొండలో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తీసుకువచ్చిన 197 బిల్లును వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.