NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, ఇతర అధికారులతో కలిసి నిజామాబాద్ నగర శివార్లలో తరుచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.