AP: విశాఖలోని పార్క్ హోటల్ సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. దేశం వెలకట్టలేని అమూల్యమైన భారత రత్నం.. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదని.. పదవికే గౌరవం నేర్పిన వ్యక్తి వాజ్ పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాధవ్, సత్యకుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.