W.G: ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసే చర్యలు ఖండించాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవి ప్రతాప్ అన్నారు. శనివారం బ్యాంకు కాలనీలో గాంధీ విగ్రహం వద్ద CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ‘జీ రామ్ జీ’ బిల్లును వెన్కకి తీసుకోవాలన్నారు.