SRPT: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మిర్యాలగూడలో CPM ఆధ్వర్యంలో నల్ల బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.