AP: పోలవరం నీళ్లు త్వరలోనే అనకాపల్లికి తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి నీటిని వంశధారకు అనుసంధానం చేస్తామని తెలిపారు. రెండు, మూడేళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. అనకాపల్లికి 14 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. పెట్టుబడులతో 20 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.