MDK: ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి మండల SI సృజన పిలుపునిచ్చారు. క్షణికావేశంలో జరిగిన చిన్న తప్పులు, అనవసర వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని తెలిపారు. శత్రుత్వాన్ని పెంచుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయని, రాజీ మార్గాన్ని ఎంచుకుంటే ఇద్దరికీ మేలు జరుగుతుందన్నారు.