ATP: కంబదూరు మండల కేంద్రంలోని చర్చిలో ఇవాళ నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి చర్చి కమ్యూనిటీ భవనం పూర్తయ్యేలా చూస్తానని, క్రిస్మస్ రోజున భక్తులకు వస్త్రాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.