KMR: పేదలు, కూలీల జీవనాధారమైన వంద రోజుల పని దినాల చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుగారుస్తోందని సీపీఐ ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతిరామ్ విమర్శించారు. ఈ చట్టాన్ని రక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన పిలుపునిచ్చారు. చట్టం మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో పోరాటమే మార్గమని పేర్కొన్నారు.