ATP: కంబదూరు మండలం నూతిమడగు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో అద్భుత ప్రతిభ చాటారు. ఒకే పాఠశాల నుంచి ఏకంగా 52 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై రికార్డు సృష్టించారు. పీఈటీ సంజీవరాయుడు ప్రత్యేక శిక్షణతో విద్యార్థులు ఈ ఘనత సాధించారని ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి శనివారం తెలిపారు.