WGL: నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో గాంధీ విగ్రహం నుంచి గౌడ సంఘం భవనం వరకు ఉన్న రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన నూతన సర్పంచ్ సమ్మయ్య, మాజీ సర్పంచ్ తిరుపతి ఇవాళ ట్రాక్టర్ల సాయంతో మట్టి తెప్పించి రోడ్డును చదును చేశారు. దీంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.