హైదరాబాద్ నల్లకుంట వడ్డేరబస్తీలో భారీ ప్రమాదం తప్పింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో భవనం మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన ఏడుగురిని పోలీసులు చాకచక్యంగా రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.