టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఇటీవల కాలంలో వైట్‌బాల్ క్రికెట్లో దారుణంగా విఫలమవుతున్న గిల్‌ను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. గిల్ దూరం కావడంతో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.