KRNL: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం నూతనపల్లి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తడి, పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు. అలాగే పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.