JN: MNAREGA నిధుల్లో కేంద్రం వాటా తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాన్యపు భుజేందర్ అన్నారు. MNAREGA పై తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.