TPT: శ్రీకాళహస్తిలోని వేడం రోడ్లపై గుంతలు ఏర్పడి నీరు నిలుస్తోంది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఆ రోడ్డుపై వరి నాట్లు నాటారు. కూటమి ప్రభుత్వం రోడ్డులను బాగుచేస్తున్నామంటూ డప్పు కొట్టుకుంటోందని వారు విమర్శించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని నాయకుడు దామోదరం రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు.