MDK: జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాణిని మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు వచ్చిన వివిధ రకాల కేసుల సంఖ్య, సమన్వయంతో త్వరిత న్యాయ పరిష్కారాలు అందించాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.