బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ దాదాపు ఆరేళ్ల తర్వాత కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనీస్ బాజ్మీతో అక్షయ్ ఓ మూవీ చేయనున్నాడు. ఇందులో కథానాయికగా విద్యా బాలన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘హే బేబీ’, ‘భూల్ భులయ్యా’ సినిమాల్లో వీరిద్దరూ నటించారు. అయితే ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా.. 2026లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.