MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం వేముల గ్రామంలో హత్యాచారానికి గురైన ప్రవళిక కుటుంబానికి న్యాయం జరగాలని అంబెడ్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి యాదయ్య అన్నారు. శనివారం బాలానగర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హత్యకు కారణమైన విష్ణు అతని స్నేహితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.