KMM: న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో కోడిపందెం, పేకాట, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి హెచ్చరించారు. కోడిపందేలు, కత్తులు కట్టినా, శిబిరాలు పెట్టినా నిఘా ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి బైండోవర్ చేస్తామన్నారు. అలాగే సెలవుల్లో ఇల్లు విడిచి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.