NDL: నంది కొట్కూరు మండలం, వడ్డేమాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని, చెత్త ఊడ్చి, చెట్లు నాటి, ప్రతిజ్ఞ చేయించారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.