HYD: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం ఎన్నికలవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అదే టెంపో కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 300 డివిజన్లకు పెరిగిన మహానగరంలో 151 చోట్ల విజయం సాధిస్తే గ్రేటర్లో కాంగ్రెస్ జెండా ఎగరుతుంది. ఆ వైపుగా CM, PCC చీఫ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.