BHNG: యూరియా మానిటరింగ్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో యూరియా మానిటరింగ్ యాప్‌పై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పరిపాలన అధికారులకు అవగాహన కల్పించారు. రైతులు ఇంటి వద్ద నుండే తమ స్మార్ట్ ఫోన్ ద్వారా కావాల్సిన యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు.