VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలో కొత్తవలస పీఏసీఎస్. అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ( శ్రీను) ఆద్వర్యంలో వ్యవసాయ రుణాలు, పీఏసీఎస్‌లో సభ్యత్వాలు, భీమాపై ఇవాళ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదుకు 10 సెంట్ల భూమి కలిగి 1బి, ఆదార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం 3 ఫోటోలు జతచేసి రూ 400 కట్టాలని సూచించారు.