KMM: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ నేత ఎడవల్లి రామ్ రెడ్డి అంతిమయాత్రలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శనివారం పాలేరులో నిర్వహించిన యాత్రలో ఆయన పాల్గొని రామ్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వయంగా పాడే మోశారు. మంత్రి మాట్లాడుతూ.. రామ్ రెడ్డి మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.